Medak District: హరీశ్‌రావుకు తప్పిన పెను ప్రమాదం

  • రోడ్‌షోలో పాల్గొన్న హరీశ్
  • జనరేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు
  • వాహనం దిగి వెళ్లిపోయిన హరీశ్
మెదక్ జిల్లా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు పెను ప్రమాదం తప్పింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆయన తూప్రాన్‌‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ప్రచార వాహనం పైకి ఎక్కి హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో తన ప్రసంగాన్ని అర్థాంతరంగా నిలిపి వేసిన హరీశ్‌రావు వాహనం దిగి అక్కడి నుంచి వెళ్లి పోయారు.
Medak District
Tupran
Harish Rao
Road Show
Loksabha

More Telugu News