Loksabha: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీగా నగదు, మద్యం స్వాధీనం

  • రూ.18.70 కోట్ల నగదు
  • రూ.2.67 కోట్ల విలువైన మద్యం
  • రూ.2.48 కోట్ల విలువైన మారకద్రవ్యాలు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీస్, ఐటీ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నగదుతో పాటు మద్యం, మాదక ద్రవ్యాలు భారీ మొత్తంలో లభించాయి. రూ.18.70 కోట్ల నగదు, రూ.2.67 కోట్ల విలువైన మద్యం, రూ.2.48 కోట్ల విలువైన మారకద్రవ్యాలు, గుట్కాను అధికారులు సీజ్ చేశారు.

వీటితో పాటు రూ.26.76 లక్షల విలువ గల బంగారు, వెండి ఇతర ఆభరణాలు, రూ.3.93 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేశారు. వీటన్నింటి విలువ మొత్తంగా రూ. 24.17 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Loksabha
Telangana
Police
Gold
Silver

More Telugu News