Jana Sena: జనసేన బహిరంగ సభలో తొక్కిసలాట.. ఆటోడ్రైవర్ దుర్మరణం
- నంద్యాల సభలో అపశ్రుతి
- ఏం జరుగుతోందో తెలియని స్థితిలో తొక్కిసలాట
- కేసు నమోదు చేసిన పోలీసులు
జనసేన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇవాళ పవన్ కల్యాణ్ పాల్గొన్న సభలో అనూహ్యరీతిలో భారీగా తొక్కిసలాట జరగడంతో ఓ ఆటోడ్రైవర్ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. మరణించిన వ్యక్తిని సిరాజ్ గా గుర్తించారు. అతడి వయసు 30 సంవత్సరాలు.
పవన్ కల్యాణ్ హాజరైన ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభకోసం ఏర్పాటు చేసిన స్పీకర్లకు ఉన్న ఇనుప రాడ్లు జారిపోవడంతో జనాల్లో తొక్కిసలాట ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒకరినొకరు తొక్కుకోవడంతో సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని నంద్యాల ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.