kiara advani: సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణంపై కియారా అద్వానీ స్పందన

  • అన్నీ పుకార్లేనని కొట్టిపారేసిన కియారా
  • ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానంటూ వ్యాఖ్య
  • తన జీవితం రంగులమయం కాదన్న సిద్ధార్థ్
'భరత్ అను నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలతో టాలీవుడ్ లో మంచి మార్కులు కొట్టేసింది ఉత్తరాది భామ కియారా అద్వానీ. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలతో ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం సాగిస్తోందంటూ బీటౌన్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై కియారా స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని స్పష్టం చేసింది.

ఇదే అంశంపై సిద్ధార్థ్ స్పందిస్తూ... అందరూ అనుకుంటున్నట్టు తన జీవితం రంగులమయం కాదని అన్నాడు. తన నిజ జీవితంలో ఉండే ఆనందాలు చాలా తక్కువని తెలిపాడు. పత్రికల్లో తనపై వస్తున్న పుకార్ల గురించి తనకు తెలియదని చెప్పాడు. కియారాతో పని చేయడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు.
kiara advani
sidharth malhotra
love
bollywood

More Telugu News