supreme court: చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో సీఈసీ అఫిడవిట్

  • వీవీప్యాట్ స్లిప్పులను 50 శాతం లెక్కించాల్సిన అవసరం లేదు
  • నియోజకవర్గంలోని ఒక బూత్ లో స్లిప్పులను లెక్కించాలని నిర్ణయించాం
  • అవసరమైతే ఈ సంఖ్యను మరింత పెంచుతాం
వీవీప్యాట్ ల స్లిప్ లను 50 శాతం లెక్కించాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. 50 శాతం స్లిప్ లను లెక్కించాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో సీఈసీ పేర్కొంది. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత... అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని నిర్ణయించామని తెలిపింది. అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఈ సంఖ్యను మరింత పెంచుతామని చెప్పింది. 
supreme court
chandrababu
cec
vv pot

More Telugu News