Chandrababu: మీ ఓటమి ఖాయమని ఫరూక్‌ తేల్చేశారుగా: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్‌

  • ఈ మేరకు ట్విట్టర్‌లో కామెంట్‌
  • స్వయంగా మీతోనే అన్నారట కదా అని వ్యాఖ్య
  • మీ సభలకు జనసమీకరణ చేయలేకపోతున్నామని మీ కార్యకర్తలే వాపోతున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సెటైర్‌ వదిలారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఓడిపోతున్నారని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా స్వయంగా మీతోనే చెప్పారట గదా చంద్రబాబుగారు?’ అంటూ ట్వీట్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతోందని తెలుగు తమ్ముళ్లు కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారని, తాజాగా ఫరూక్‌ కూడా మీ ఓటమి ఖాయం చేసేసారని ఎద్దేవా చేశారు. మీ తండ్రీకొడుకుల సభలకే జన సమీకరణ చేయలేక ఇబ్బంది పడుతుంటే, జాతీయనాయకులెందుకని వాపోతున్నారన్నారు. కానీ చేయాల్సిందేనని కార్యాలయాలకు ఫోన్లుచేసి బాధ్యులకు పార్టీ పెద్దలు అల్టిమేటం ఇస్తున్నారని మీ ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారని ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. 
Chandrababu
Vijay Sai Reddy
Twitter
farookh

More Telugu News