India: కాంగ్రెస్ లో చేరిన రెండ్రోజులకే.. లోక్ సభ టికెట్ దక్కించుకున్న నటి ఊర్మిళ!

  • ముంబై నార్త్ సీటును దక్కించుకున్న నటి
  • ప్రకటించిన సీనియర్ నేత ముకుల్ వాస్నిక్
  • సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావాలన్నఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా పార్టీలో చేరిన రెండు రోజుల్లోనే ఊర్మిళ టికెట్ దక్కించుకున్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ముంబై నార్త్ స్థానం నుంచి ఊర్మిళ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ తెలిపారు.

రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఊర్మిళ మతోండ్కర్ చేరారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాహుల్ నాయకత్వం నచ్చే పార్టీలో చేరానని ఊర్మిళ ప్రకటించారు. సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. దేశంలో అసహనం పెరిగిపోయిందనీ, రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని కేంద్ర ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు.
India
Congress
mumbai north
urmila mandothkar
loksabha

More Telugu News