Andhra Pradesh: వెన్నుపోటు డైరెక్టర్ ఓడిపోవాలని కమండలంలోని నీళ్లు తీసి శపిస్తున్నాం.. తథాస్తు!: రామ్ గోపాల్ వర్మ

  • ఏపీ ప్రజలు తప్ప అందరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తారు
  • ఇది నిజంగా హతవిధి
  • ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఈరోజు విడుదల అయింది. అయితే ఏపీలో ఈ సినిమాపై వచ్చే నెల 3 వరకూ స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏపీ తప్ప ప్రపంచమంతటా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతోంది.

ఈ నేేపథ్యంలో సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ప్రప్రథమంగా తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దక్కిందని వ్యాఖ్యానించారు. ఈ సినిమాను ఏపీ ప్రజలు తప్ప ప్రపంచంలోని తెలుగువారంతా చూడగలగడం నిజంగా హతవిధి అని వాపోయారు.

‘సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎన్టీఆర్ ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపుతున్నామని వర్మ తెలిపారు. ఈ సినిమాను ప్రజలు చూడకుండా ఆపుతున్న తెరవెనుక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ ఓడిపోవాలని తనలాంటి కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులు కమండలంలోని నీళ్లు తీసి శపిస్తున్నామని వ్యాఖ్యానించారు.

‘సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే కథతో రూపొందిన ఈ సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ ని నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలం లో నీళ్లు తీసి శపిస్తున్నాం ..ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తథాస్తు’ అని వర్మ ట్వీట్ చేశారు.

More Telugu News