Jagan: రాజన్న పాలన జగన్‌తోనే సాధ్యం.. ఒక్క అవకాశం ఇవ్వండి: విజయమ్మ

  • ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులు
  • మరికాసేపట్లో ప్రారంభం కానున్న ప్రచారం
  • నేడు, రేపు ఫుల్ బిజీ
జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలను కోరారు. నేటి నుంచి ప్రచారానికి సిద్ధమైన విజయమ్మ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజన్న పాలన కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టి జగన్‌కు ఒక్కసారి అవకాశమివ్వాలని కోరారు.  

ఈ ఐదేళ్లలో తానేం చేశానో చెప్పుకోలేని చంద్రబాబు.. జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ప్రజల్లో జగన్‌కు మంచి ఆదరణ ఉందని, జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. విజయమ్మ మరికాసేపట్లో కందుకూరులో, మధ్యాహ్నం ఒంటిగంటకు కనిగిరిలో , సాయంత్రం నాలుగు గంటలకు మార్కాపురంలో ప్రచారం నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బసచేసి శనివారం 10 గంటలకు యర్రగొండపాలెంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
Jagan
YSRCP
Kadapa District
YS Vijayamma
Chandrababu

More Telugu News