Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో తమిళ చిత్రంలో రష్మిక
  • బయోపిక్ పై ఇళయరాజా ఆసక్తి 
  • షూటింగుకి రెడీ అవుతున్న గోపీచంద్
 *  దక్షిణాది భాషల్లో బిజీ హీరోయిన్ అవుతున్న రష్మిక మందన తమిళంలో మరో చిత్రం చేయనుంది. శివకార్తికేయన్ హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్ పాత్ర ఆమెకు లభించినట్టు సమాచారం. ఇప్పటికే కార్తీ సరసన ఒక తమిళ చిత్రాన్ని రష్మిక చేస్తోంది.
*  సినిమా సంగీతంలో పలు ప్రయోగాలు చేసి, తనదైన ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెరపై కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. తన బయోపిక్ ను తీయడానికి ఎవరైనా ముందుకు వస్తే అందులో నటించడానికి తనకు అభ్యంతరం లేదని ఇళయరాజా తాజాగా చెప్పారు.
*  ఇటీవల షూటింగులో గాయపడ్డ యాక్షన్ హీరో గోపీచంద్ విశ్రాంతి తర్వాత గాయాల నుంచి కోలుకున్నాడు. దీంతో తిరు దర్శకత్వంలో రూపొందుతున్న తన 26వ చిత్రం షూటింగులో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 10 నుంచి జరిగే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లో గోపీచంద్ పాల్గొంటాడు.
Rashmika
Karthi
Ilayaraja
Gopichand

More Telugu News