అందుకే వెనకబడ్డాను .. ఇకపై జాగ్రత్తగా వుంటాను: అనూ ఇమ్మాన్యుయేల్
- 'మజ్ను'తో తెలుగు తెరకు పరిచయం
- యూత్ లో పెరిగిన క్రేజ్
- వరుసగా పలకరించిన పరాజయాలు
తాజాగా ఆమె మాట్లాడుతూ .."కెరియర్ తొలినాళ్లలో వరుసగా గ్లామరస్ పాత్రలను చేస్తూ వెళ్లాను. అదే సమయంలో నాకు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను చేశాను. ఈ కారణంగానే నేను వెనకబడిపోయాను. ఇకపై కథల విషయంలో .. నా పాత్రల విషయంలో జాగ్రత్తగా వుంటాను. గ్లామర్ తోపాటు నటనకి అవకాశం వుండే ప్రాధాన్యత గల పాత్రలను మాత్రమే చేస్తాను" అని చెప్పుకొచ్చింది.