Ys viveka: వైఎస్ వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు..కోర్టు ఎదుట హాజరు

  • సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్టు గుర్తింపు
  • ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ అరెస్టు
  • పులివెందుల  పోలీసుల పత్రికా ప్రకటన
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సాక్ష్యాలు తారుమారు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి  వంట మనిషి కుమారుడు ప్రకాశ్ ను అరెస్టు చేసినట్టు ఈ మేరకు పులివెందుల పోలీసులు ప్రకటించారు.

వివేకా హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాత్రూమ్ లో ఉన్న వివేకా మృతదేహాన్ని బెడ్ రూమ్ కి తరలించారని, బెడ్రూమ్ లో ఉన్న రక్తపు ఆనవాళ్లు చెరిపేసి సాక్ష్యాధారాలు తారుమారు చేశారని భావించిన పోలీసులు, ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే వున్నాడని నిర్ధారించారు. వివేకా రాసిన లేఖ ఉదయం సమయంలోనే దొరికినా, సాయంత్రం దాకా ఇవ్వలేదని పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టు ఎదుట పోలీసులు హాజరుపర్చారు.  
Ys viveka
pulivendula
Erra Gangi reddy
Krishna reddy
PA
Prakash

More Telugu News