ఏపీలో లబ్ధిదారులకు వరుసగా నాలుగు పథకాల సొమ్ము జమ!
- 1వ తేదీన అందనున్న పింఛన్లు
- 4, 6, 8 తేదీల్లో పసుపు-కుంకుమ, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ చెక్కులు
- 11వ తేదీన ఏపీలో పోలింగ్
ఇప్పుడు మళ్లీ కొత్త నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరే ఒకటో తేదీన పింఛను డబ్బులు జనాలకు అందనున్నాయి. 4వ తేదీన పసుపు-కుంకుమ చెక్కులు, 6వ తేదీన రైతు రుణమాఫీ చెక్కులు, 8వ తేదీన అన్నదాత సుఖీభవ చెక్కులు జనాలకు అందనున్నాయి. 9వ తేదీ సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, 10 రోజుల వ్యవధిలో జనాలకు అందనున్న ప్రభుత్వ పథకాలు టీడీపీకి మేలు చేస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.