Andhra Pradesh: కృష్ణా జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారంపై తేనెటీగల దాడి.. పరుగులు తీసిన కార్యకర్తలు!
- ముసునూరు మండలం గోగులంపాడులో ఘటన
- టీడీపీ నేత వెంకటేశ్వరరావు ప్రచారం సందర్భంగా దాడి
- పలువురు ఆసుపత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తేనెటీగలు దాడిచేశాయి. జిల్లాలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ శ్రేణులు ప్రచారానికి వచ్చాయి. అంతలోనే దారిలో ఉన్న తేనెతుట్ట ఒక్కసారిగా కదిలింది. వెంటనే గాల్లోకి లేచిన తేనెటీగలు దొరికినవారిని దొరికినట్లు కుట్టాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు తలోదిక్కుకు పరుగెత్తారు.
ఈ ఘటనలో అస్వస్థతకు లోనైన పలువురు టీడీపీ కార్యకర్తలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.