Balakrishna: మీడియాను క్షమాపణ కోరుతున్నా: నందమూరి బాలకృష్ణ

  • మీడియా ప్రతినిధిని కొట్టిన బాలయ్య
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • అల్లరి మూకలని భావించానన్న బాలయ్య

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియా ప్రతినిధిపై హిందూపురం టీడీపీ అభ్యర్థి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కొట్టాడని, తిట్టాడని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుండటంతో, బాలకృష్ణ స్పందించారు. వారు మీడియా వారని తనకు తెలియదని, అల్లరి మూకలని అనుకుని వారిని వారించానని అన్నారు. క్షమాపణలు కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

"మీడియా మిత్రులకి నమస్కారం.. ఇవాళ నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ... మీ నందమూరి బాలకృష్ణ’’ అని అన్నారు.

More Telugu News