Palakollu: అయ్యా యాక్టర్ గారూ... మా ఇంట్లో జరిగినట్టు మీ ఇంట్లో హత్య జరిగితే?: పవన్ పై జగన్ విసుర్లు

  • పాలకొల్లులో ఎన్నికల ప్రచారం
  • పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన జగన్
  • మీ ఇంట్లో ఎవరినైనా హత్య చేయించి, మీరే చేశారంటే...
  • వైఎస్ జగన్ విమర్శల వర్షం
ఈ ఉదయం పాలకొల్లులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ పేరెత్తకుండా ఆయన్ను టార్గెట్ చేస్తూ, విమర్శలు గుప్పించారు. "అయ్యా యాక్టర్ గారూ... అయ్యా పార్టనర్ గారూ... ఇదే మీ కుటుంబంలోనే, మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే, ఎవరినైనా బాబు మనుషులు హత్య చేస్తే... ఆ హత్య వాళ్లే చేయించి, వాళ్ల పోలీసుల చేత వాళ్లే ఎంక్వయిరీ చేయించి, ఆ తరువాత వాళ్లే, వాళ్ల పత్రికలతోనే, వాళ్ల ఎల్లో మీడియాతోనే దాన్నే వక్రీకరిస్తూ, మీ బంధువులే ఆ పని చేశారు. మీరే ఆ పని చేశారు అని వాళ్లందరూ అంటే, మీకు నచ్చుతుందా పార్టనర్ గారూ? అని అడుగుతా ఉన్నాను ఈ యాక్టర్ గారిని.

తనదాకా వస్తేగాని ఆ బాధ ఏమిటో అర్థం కాదన్న సామెత ఉంది. ఇవాళ ఇదే పార్టనర్ గారు చేస్తున్న అన్యాయాలను గమనించమని అడుగుతా ఉన్నా. నాలుగు సంవత్సరాలు ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడుతో కలిసి కాపురం చేస్తారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుగారికి ఓటేయమని చెప్పి ఈ పార్టనర్ గారే ఓటేయిస్తారు. ఓటు వేయించిన తరువాత నాలుగు సంవత్సరాలు చేసిన ప్రతి అన్యాయంలోనూ, ప్రతి మోసంలోనూ ఈ పార్టనర్ అక్కడే ఉంటడు. నేను అడుగుతా ఉన్నా... చంద్రబాబు చేసిన ఇన్నిన్ని మోసాలు, అవినీతి, దారుణాల్లో మీకు కూడా వాటా లేదా? అని అడుగుతా ఉన్నాను" అని నిప్పులు చెరిగారు.
Palakollu
Jagan
Pawan Kalyan
Elections
Campaign

More Telugu News