Anshul Verma: బీజేపీ సిట్టింగ్ ఎంపీకి టికెట్ నిరాకరణ.. ‘చౌకీదార్’కు అడ్రస్‌చేస్తూ రాజీనామా లేఖ

  • అన్షుల్ వర్మకు హర్దోయి సీటు నిరాకరణ
  • జై ప్రకాశ్ రావత్‌కు టికెట్
  • పార్టీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన వర్మ

తనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ ‘చౌకీదార్‌’ (మోదీ)కి రాజీనామా చేస్తూ లేఖ పంపడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి స్థానం నుంచి బీజేపీ నేత అన్షుల్ వర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం నిరాకరించింది. బీజేపీ తీరుతో మనస్తాపానికి గురైన అన్షుల్.. బుధవారం పార్టీకి రాజీనామా చేస్తూ ‘చౌకీదార్’ (మోదీని ఉద్దేశించి)కు అడ్రస్ చేస్తూ రాజీనామా లేఖ రాసి బీజేపీ లక్నో కార్యాలయంలో అందించారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు.  

అనంతరం వర్మ మాట్లాడుతూ.. తాను దళితుడిని కాబట్టే బీజేపీ టికెట్ నిరాకరించిందని ఆరోపించారు. మొత్తం ఆరుగురు దళితులకు టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించిందని, దీనిని బట్టి దళితులకు ఆ పార్టీ ఇచ్చే ప్రాధాన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ స్థానానికి బీజేపీ టికెట్ ను జై ప్రకాశ్ రావత్‌కు కేటాయించింది. హర్దోయి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడం గమనార్హం! 

  • Loading...

More Telugu News