Facebook: కశ్మీర్ ను ప్రత్యేక దేశమన్న ఫేస్ బుక్... ఆపై క్షమాపణలు!

  • ఇరాన్ నెట్ వర్క్ లను ప్రస్తావిస్తూ బ్లాగ్ పోస్ట్
  • టార్గెట్ దేశాల్లో కశ్మీర్ ను పేర్కొన్న ఫేస్ బుక్
  • విమర్శలు రావడంతో దిగొచ్చి క్షమాపణలు
భారత్ లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పేర్కొన్న ఫేస్ బుక్, నలువైపుల నుంచి విమర్శలు తలెత్తడంతో జరిగిన తప్పును గుర్తించి క్షమాపణలు చెప్పింది. ఇరాన్ నెట్ వర్క్ లకు టార్గెట్ గా మారిన దేశాలను ప్రస్తావిస్తూ, ఓ బ్లాగ్ పోస్ట్ పెట్టిన ఫేస్ బుక్, అందులో కశ్మీర్ ను ఓ కంట్రీగా పేర్కొంది. ఇరాన్ కేంద్రంగా నడుస్తున్న నెట్ వర్క్ లు అనధికార కార్యకలాపాలు చేపడుతున్నాయని, దీంతో ఫేస్ బుక్ లోని 513 ఖాతాలు, గ్రూప్ లను తొలగించామని వెల్లడించింది. ఆపై కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పేర్కొన్నందుకు చింతిస్తున్నామని, ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని తెలిపింది.
Facebook
Jammu And Kashmir
Country
Sorry

More Telugu News