Andhra Pradesh: ప్రత్యేకహోదాకు మద్దతిస్తానని జగన్ చెవిలో కేసీఆర్ చెప్పాడా?: సీఎం చంద్రబాబు

  • కేసీఆర్ చెప్పిన మాటలు మాకు వినపడలేదే
  • ఏం జగన్, ఎవరి చెవిలో పువ్వులు పెడతావు?
  • కేసీఆర్, నరేంద్రమోదీలిద్దరూ ఏపీకి విరోధులు
ఏపీకి ప్రత్యేకహోదా విషయమై మద్దతు ఇస్తానని కేసీఆర్ చెప్పాడని జగన్ అంటున్నారని, ఈ విషయాన్ని జగన్ చెవిలో ఆయన చెప్పాడా? తమకు వినపడలేదని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అనంతపురంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే హోదా ఇవ్వాలని కేసీఆర్ అన్న విషయాన్ని ప్రస్తావించారు.

‘ఏం జగన్ మోహన్ రెడ్డి! ఎవరి చెవిలో పువ్వులు పెడతావు?’ అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్, నరేంద్రమోదీలిద్దరూ ఏపీకి విరోధులు అని, స్వలాభం కోసం వారికి వత్తాసు పలుకుతున్న జగన్ ‘ఆంధ్రా ద్రోహి’ అని మండిపడ్డారు. ఏపీపై కేసీఆర్ పెత్తనం కుదరదని, రాజకీయ కుట్రతో మనపై పెత్తనం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అదృష్టమో, దురదృష్టమో కేసీఆర్ కు మెజార్టీ వచ్చిందని, అయినా కూడా ఇతర పార్టీలను ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. తాను పెద్ద బలవంతుడినని, జగన్ కు మద్దతు ఇస్తానని కేసీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు.  
Andhra Pradesh
Anantapur
cm
Chandrababu

More Telugu News