Vizag: చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు: వైఎస్ జగన్

  • ఇప్పటికే 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు
  • ‘నారాయణ’లో ఎల్ కేజీ చదవాలంటే రూ.25 వేలు 
  • చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎల్ కేజీ ఫీజు రూ.లక్ష

ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఏపీలో ఒక్క ప్రభుత్వం పాఠశాల కూడా ఉండదని వైసీపీ అధినేత జగన్ సెటైర్లు విసిరారు. విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారని విమర్శించారు.

 నారాయణ స్కూల్ లో ఎల్ కేజీ చదవాలన్నా రూ.25 వేలు ఉందని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎల్ కేజీ ఫీజు రూ.లక్ష అవుతుందని విమర్శించారు. ఆర్టీసీ, కరెంటు కూడా ఏమీ మిగల్చడని, అన్నీ ప్రైవేట్ పరం చేస్తాడని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికలు పూర్తవగానే అన్ని సంక్షేమ పథకాలు కత్తిరించేస్తాడని, ఇచ్చిన హామీలన్నీ గాలికి పోతాయని, మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే పిల్లలు చదువుకునే పరిస్థితి ఉండదని వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News