polavaram: పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీంకోర్టులో మరో అఫిడవిట్ వేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం

  • పర్యావరణ ప్రభావాన్ని మరోసారి అంచనా వేయండి
  • డిజైన్ మార్పుతో ముంపు ప్రభావం 50 లక్షల క్యూసెక్కులకు చేరింది
  • 19 టీఎంసీల నీటిని అదనంగా వాడుకునేందుకు అనుమతివ్వండి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాలని, అప్పటివరకు నిర్మాణాన్ని ఆపాలని కోరింది. దీంతో పాటు వరద ముంపును కూడా మరోసారి అంచనా వేయాలని విన్నవించింది. డిజైన్ మార్పుతో ముంపు ప్రభావం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని చెప్పింది. పట్టిసీమ ద్వారా ఏపీ అధికంగా నీటిని వినియోగించుకుంటోందని, ఈ నేపథ్యంలో తమ వాటాగా 19 టీఎంసీల నీటిని అదనంగా వాడుకునేందుకు అనుమతినివ్వాలని కోరింది. 2005లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

More Telugu News