vijayawada: జలీల్ ఖాన్ కూతురు నామినేషన్ ఆమోదం

  • షబానాకు అమెరికా పౌరసత్వం ఉందంటూ వార్తలు
  • ఎలాంటి విదేశీ పౌరసత్వం లేదని తెలిపిన రిటర్నింగ్ అధికారులు 
  • ఊపిరి పీల్చుకున్న టీడీపీ శ్రేణులు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. టీడీపీ నేత జలీల్ ఖాన్ కుమార్తె, టీడీపీ అభ్యర్థి షబానా ఖాతూన్ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. షబానాకు అమెరికా పౌరసత్వం ఉన్న కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే షబానాకు ఎలాంటి విదేశీ పౌరసత్వం లేదని... రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి తెలిపారు. షబానా నామినేషన్ ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.
vijayawada
west
Telugudesam
jalil khan
shabana
nomination

More Telugu News