vijay devarakonda: విజయ్ దేవరకొండకి గట్టి పోటీ ఇస్తోన్న సూర్య

  • భరత్ కమ్మ నుంచి 'డియర్ కామ్రేడ్'
  • మే 31వ తేదీన భారీ విడుదల 
  • అదే రోజున రానున్న సూర్య మూవీ 

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' సినిమా నిర్మితమైంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాను మే 31వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే చెప్పారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను అదే రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

పెద్ద సినిమాలేవీ దగ్గరలో లేకపోవడం .. 'డియర్ కామ్రేడ్'కి కలిసొచ్చే అంశమని అనుకున్నారు. అయితే అనుకోకుండా 'ఎన్జీకే' వచ్చి ఇదే డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చి, ఈ తేదీని ఖరారు చేసుకుంది. తమిళనాట సూర్యకి గల క్రేజ్ గురించి తెలిసిందే. అందువలన విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' కి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ పోటీని విజయ్ దేవరకొండ ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి.

More Telugu News