ashok kumar: అక్కినేని తరువాత 'తెనాలి రామకృష్ణుడు' అంటే నేనే: సీనియర్ నటుడు అశోక్ కుమార్

  • అక్కినేని తరువాత ఆ పాత్ర చేసింది నేనే 
  • 'తెనాలి రామకృష్ణుడు' పాత్ర అంటే ఇష్టం 
  • నారదుడి పాత్ర నన్ను కాపాడుతూ వచ్చింది  

నటుడిగా అటు వెండితెర మీద .. ఇటు బుల్లితెర మీద అశోక్ కుమార్ ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించారు. ఆయన ఎన్ని పాత్రలు చేసినా .. గొప్పపేరును తీసుకొచ్చిన పాత్రల జాబితాలో ముందుగా నారద మహర్షి .. తెనాలి రామకృష్ణుడు వంటి పాత్రలు కనిపిస్తాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " అక్కినేని నాగేశ్వరరావు గారు 1956లో 'తెనాలి రామకృష్ణ' చేసిన తరువాత, 1986లో మళ్లీ 'తెనాలి రామకృష్ణుడు'ను టచ్ చేసింది నేనే.

నా తరువాత ఇంతవరకూ ఎవరూ ఆ పాత్రను టచ్ చేసింది లేదు. అందువలన ఈ విషయాన్ని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. నా కంటే గొప్పగా చేసేవాళ్లు ఎవరైనా వస్తే సహజంగానే .. వాళ్ల గురించే చెప్పుకుంటారు. ఇంతవరకూ నేను చేసిన పాత్రల్లో నాకు 'తెనాలి రామకృష్ణుడు' అంటే చాలా ఇష్టం. ఇక నేను చేసిన నారదుడి పాత్ర కూడా నాకు ఇష్టమే. నా గ్రాఫ్ తగ్గుతున్న ప్రతిసారీ .. నారదుడి పాత్ర నన్ను మళ్లీ పైకి లేపుతూ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News