deepa malik: బీజేపీలో చేరిన దీపా మాలిక్.. నేరుగా ఎన్నికల బరిలోకి?

  • హరియాణా పార్టీ చీఫ్ సుభాష్ సమక్షంలో చేరిక
  • మహిళలకు మోదీ పెద్దపీట వేస్తున్నారని ప్రశంస
  • దీప దేశానికి గర్వకారణమన్న పార్టీ చీఫ్
పారాలింపిక్‌లో దేశానికి తొలి పతకాన్ని అందించిన ప్రముఖ అథ్లెట్ దీపా మాలిక్ సోమవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ హరియాణా చీఫ్ సుభాష్ బరాలా, ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ మాట్లాడుతూ.. దీపామాలిక్ అందరికీ స్ఫూర్తి అని, దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

హరియాణా లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దీపామాలిక్‌కు టికెట్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, మహిళా సాధికారతకు ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని దీపా మాలిక్ అన్నారు. మహిళలకు ఆయన సముచిత స్థానం ఇస్తున్నారని, ఆయన కేబినెట్‌లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం మోదీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని దీపా మాలిక్ కొనియాడారు.
deepa malik
BJP
Haryana
Lok Sabha elections
Narendra Modi

More Telugu News