Janasena: మా పార్టీ అధికారంలో కొస్తే దీనిపైనే నా మొదటి సంతకం: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • నా మొదటి సంతకం రైతన్న కోసమే చేస్తా
  • 60  సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకూ పెన్షన్ ఇస్తాం
  • ప్రతి నెలా రూ.5 వేల చొప్పున పెన్షన్ అందజేస్తాం
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే తన మొదటి సంతకం రైతన్న కోసమే చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, అరవై సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ అందజేసే పథకాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికే ప్రతి ఏటా పెన్షన్ వస్తుంటే, మరి, తన జీవితాంతం కష్టపడే రైతుకు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించిన పవన్, రైతన్నకు తాము అండగా ఉంటామని, అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
Janasena
Pawan Kalyan
Guntur District
Vemuru

More Telugu News