Pawan Kalyan: నేడు చరిత్రలో బ్లాక్ డే... నా నామినేషన్ తిరస్కరణకు ఆ ముగ్గురే కారకులు: కేఏ పాల్ ఆగ్రహం

  • పవన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి
  • చంద్రబాబు, జగన్ లతో కలిసి కుట్ర
  • నా సత్తా ఏంటో నరసాపురంలో చూపిస్తా
భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి తాను నామినేషన్ వేయకుండా కుట్ర జరిగిందంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. భీమవరం నుంచి తాను పోటీచేస్తున్నట్టు తెలియగానే పవన్ కల్యాణ్ భయపడ్డాడని, అందుకే చంద్రబాబు, జగన్ లతో కలిసి కుట్ర చేసి తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేశాడని ఆరోపించారు.

ఇవాళ నామినేషన్లకు ఆఖరిరోజు కావడంతో కేఏ పాల్ నామినేషన్ వేసేందుకు రాగా, అప్పటికే సమయం మించిపోయిందంటూ రిటర్నింగ్ అధికారి దిమ్మదిరిగే షాకిచ్చారు. దాంతో కేఏ పాల్ హతాశుడయ్యారు. ఈరోజు చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని మండిపడ్డారు. చంద్రబాబు, జగన్, పవన్ అవినీతిపరులని, భీమవరంలో తనను అడ్డుకున్నా, తన సత్తా ఏంటో నరసాపురంలో చూపిస్తానని పాల్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. నరసాపురాన్ని కొద్దికాలంలోనే నార్త్ అమెరికాలా తయారుచేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
Pawan Kalyan
Chandrababu
Jagan

More Telugu News