kcr: కేసీఆర్ పై రీసర్చ్ మొదలు పెట్టా: రామ్ గోపాల్ వర్మ

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఇంతవరకు సెన్సార్ బోర్డు చూడలేదు
  • విడుదలకు ఆటంకాలు ఉండవనే అనుకుంటున్నా
  • కేసీఆర్ పై బయోపిక్ నిర్మించబోతున్నా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బయోపిక్ ను తెరకెక్కించనున్నానని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ పై రీసర్చ్ మొదలు పెట్టానని చెప్పారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఇంత వరకు సెన్సార్ బోర్డు చూడలేదని వర్మ తెలిపారు. ఈనెల 29న సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండవనే అనుకుంటున్నానని చెప్పారు. మరోవైపు, ఈ చిత్రాన్ని తమకు చూపించాలంటూ ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది.  
kcr
ram gopal varma
biopic
lakshmis ntr
tollywood

More Telugu News