Telugudesam: పింఛన్ లబ్ధిదారులపై టీడీపీ వరాల జల్లు.. అధికారంలోకి వస్తే రూ.3 వేల పింఛన్

  • గతంలో రూ.200 ఉన్న పింఛన్‌ను ఇప్పటికి రూ. 2 వేలు చేసిన ప్రభుత్వం
  • మేనిఫెస్టో తయారీలో మంత్రి యనమల బృందం బిజీ
  • ప్రజాకర్షక మేనిఫెస్టో తయారు
ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని కమిటీ ప్రజారంజక మేనిఫెస్టో తయారీలో తలమునకలైంది. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్న టీడీపీ.. మళ్లీ అధికారంలోకి వస్తే కనీస పింఛనును రూ. 3 వేలకు పెంచాలని నిర్ణయించింది. గతంలో ఈ పింఛన్ రూ. 200 కాగా, టీడీపీ ప్రభుత్వం దానిని పెంచుకుంటూ ఇప్పుడు రూ. 2 వేలు చేసింది. ఈసారి కూడా టీడీపీ గెలిచి మరోమారు అధికారంలోకి వస్తే దానిని మూడు వేలు చేస్తామని హామీ ఇవ్వబోతోంది. ఈ మేరకు మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది.
Telugudesam
Andhra Pradesh
Pension
Chandrababu
Yanamala

More Telugu News