Prasad Kumar: మాజీ మంత్రి కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనం

  • పూలుమద్ది రోడ్డు వద్ద ప్రమాదం
  • రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ప్రసాద్ కారు
  • తృటిలో తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్‌కు ప్రమాదం త్రుటిలో తప్పింది. నేడు ఆయన ప్రయాణిస్తున్న కారును వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం సిరిపురం నుంచి ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు పూలుమద్ది రోడ్డు వద్ద ఢీకొట్టారు. దీంతో ప్రసాద్ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పెను ప్రమాదమేమీ సంభవించలేదు కానీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Prasad Kumar
Congress
Bike
Car
Accident

More Telugu News