YSRCP: వైసీపీ నేతలు ఓట్ల దొంగలు: సీఎం చంద్రబాబు

  • జాగ్రత్త పడకపోతే నా ఓటు ఉండకుండా చేసేవాళ్లు
  • కడప జిల్లా పేరు, పులివెందుల పేరు జగన్ చెడగొట్టాడు
  • వైఎస్ కుటుంబం ఆంబోతుల మాదిరి ఊరిమీద పడింది
వైసీపీ నేతలు ఓట్ల దొంగలు అని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. కడప జిల్లా బద్వేలులో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జాగ్రత్త పడకపోతే తన ఓటూ ఉండకుండా చేసే దొంగలు వీళ్లు అని విరుచుకుపడ్డారు. జగన్ కు ఏపీ పోలీసులపై నమ్మకం లేదు కానీ, తెలంగాణ పోలీసులను మాత్రం నమ్ముతారని, ఒకప్పుడు, సీబీఐపై ఆయనకు నమ్మకం లేదని, ఇప్పుడు మాత్రం దానిపై నమ్మకం వచ్చిందని ‘ఏంటీ  డ్రామాలు?’ అని ప్రశ్నించారు.

 కడప జిల్లా పేరు, పులివెందుల పేరు జగన్ చెడగొట్టాడని దుమ్మెత్తి పోశారు. వైఎస్ కుటుంబం ఆంబోతుల మాదిరి ఊరిమీద పడిందన్న చంద్రబాబు, విశాఖలో వైఎస్ విజయమ్మ గతంలో పోటీ చేస్తే పులివెందుల నుంచి వెళ్లిన వైసీపీ వాళ్లను చూసి అక్కడి ప్రజలు భయపడిపోయారని, ఆమెను ఇంటికి పంపారని విమర్శించారు.
YSRCP
jagn
Telugudesam
Chandrababu
vijayamma

More Telugu News