Andhra Pradesh: నారా లోకేశ్ కు రూ.2,000 నోటు ఇచ్చిన మౌలాలి.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న ఏపీ మంత్రి!

  • గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మంత్రి లోకేశ్ ప్రచారం
  • ఎన్నికల ఖర్చులకు రూ.2 వేలు ఇచ్చిన పెద్దాయన
  • మీరు గెలిస్తే మంగళగిరి రూపురేఖలు మారుతాయని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. అన్నివర్గాల ప్రజలను కలుసుకుంటూ టీడీపీకి ఓటేయాల్సిందిగా కోరుతున్నారు. ఇందులో భాగంగా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఈరోజు లోకేశ్ ప్రచారం చేస్తుండగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. లోకేశ్ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతుండగా, మౌలాలి అనే 80 ఏళ్ల పెద్దాయన ఆయన దగ్గరకు వచ్చారు.

అనంతరం తాను అందుకున్న రూ.2,000 పెన్షన్ ను లోకేశ్ చేతికి అందించారు. ‘మీరు గెలిస్తే మంగళగిరి రూపురేఖలే మారిపోతాయి. ఆ నమ్మకంతోనే మీ ప్రచార ఖర్చుల కోసం రూ.2 వేలు ఇస్తున్నా’ అని చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన లోకేశ్ ‘మీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను. నేను తప్పకుండా ఎన్నికల్లో గెలుస్తాను’ అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మౌలాలీతో దిగిన ఫొటోను నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

More Telugu News