Vijayasai Reddy: చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని బాగానే కష్టపడుతున్నావు పవన్ కల్యాణ్: విజయసాయిరెడ్డి

  • బీఎస్పీకి ఇచ్చిన సీట్లలో వారే పోటీచేయాలిగా
  • మాయావతి పేరిట బిజినెస్ చేస్తున్నారా?
  • ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి

చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకున్న పవన్ కల్యాణ్, బాగా కష్టపడుతూ ఆయనకు లాభం కలిగే పని చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "బిఎస్పీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు కేటాయించారు. ఆ స్థానాల్లో బిఎస్పీ అభ్యర్థులు పోటీ చేయాలి కదా? కాని మీ పార్టీ వారితో నామినేషన్లు వేయించడం ఏమిటి పవన్ కళ్యాణ్ గారూ? చివరికి మాయావతి పేరుతో కూడా బిజినెస్ చేస్తున్నారా? చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీకి బాగా కష్ట పడుతున్నారు" అని అన్నారు.




  • Loading...

More Telugu News