YSRCP: చంద్రబాబు, పవన్ ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు

  • నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి
  • చర్యలు తీసుకోండి
  • సీఈవోను కోరిన నాగిరెడ్డి, గౌతంరెడ్డి
విశాఖపట్నం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీకి ఓటేస్తే మరణవాంగ్మూలం రాసుకున్నట్టే అని చంద్రబాబు వ్యాఖ్యానించారంటూ ఆయన ప్రసంగాన్ని తీవ్రంగా పరిగణించిన వైసీపీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, పూనూరు గౌతం రెడ్డి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో పవన్ పైనా ఆరోపణలు చేశారు. గాజువాక సభలో పవన్ మాట్లాడుతూ, వైసీపీని గెలిపిస్తే భూకబ్జాలకు అవకాశం ఇచ్చినట్టే అనడాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్ని కూడా నాగిరెడ్డి, గౌతంరెడ్డి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, టీడీపీ నేతలు వైసీపీకి ఓటేయొద్దని చెబుతూ కరపత్రాలు కూడా ముద్రించి పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
YSRCP
Telugudesam
Jana Sena
Chandrababu
Pawan Kalyan

More Telugu News