Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంజయ్ దత్, వరుణ్ ధావన్!

  • తారక్, చెర్రీ ప్రధాన పాత్రల్లో ‘ఆర్ఆర్ఆర్’
  • కీలక పాత్రలో అజయ్ దేవగణ్
  • కథానాయికలుగా ఆలియా, డైసీ ఎడ్గర్ జోన్స్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకుంటున్నట్టు ఇటీవల రాజమౌళి ప్రెస్‌మీట్‌లో తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి చెప్పినట్టుగానే ఇప్పటికే ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవగణ్‌ను ఎంచుకున్నారు.

ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్‌లను కథానాయికలుగా ఎంచుకున్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్‌ని ఎంచుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్, వరుణ్ ధావన్‌లు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా దర్శక, నిర్మాతలు సంజయ్, వరుణ్‌ను సంప్రదించగా వారు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది.
Rajamouli
NTR
Ram charan
Ajay Devagan
Sunjay Dutt
Varun Dhavan

More Telugu News