jayalalithaa: జయలలిత బయోపిక్ 'తలైవి'లో కంగనా రనౌత్

  • తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న జయ బయోపిక్
  • జయ పాత్రను పోషించనున్న కంగనా
  • ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ తెరకెక్కనుంది. 'తలైవి' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషిస్తోంది. ఈ రోజు కంగనా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రలో ఆమె నటిస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నారు. విష్ణు ఇందూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళంలో 'తలైవి', హిందీలో 'జయ' పేర్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, జయ బయోపిక్ తీద్దామని విష్ణు తనను సంప్రదించిన వెంటనే... ఎక్సైట్ మెంట్ కంటే ఎక్కువగా బాధ్యతను ఫీల్ అయ్యానని చెప్పారు. పురుషాధిపత్యం ఉండే సమాజంలో తన స్థానం కోసం పోరాడిన ఓ గొప్ప యోధురాలి చరిత్ర ఇది అని తెలిపారు. ఎంతో నిజాయతీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉందని చెప్పారు.

More Telugu News