Chandrababu: ఎన్నికల నామినేషన్ విషయంలో.. ఈరోజు విజయవాడ కోర్టులో ప్రమాణం చేయనున్న చంద్రబాబు

  • కుప్పంలో చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన టీడీపీ నేతలు
  • రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉన్న సీఎం
  • ఈరోజు విజయవాడ సివిల్ కోర్టులో ప్రమాణం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరపున టీడీపీ నేతలు నిన్న నామినేషన్ ధాఖలు చేశారు. కుప్పం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి వద్ద చంద్రబాబు ప్రమాణం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న నాల్గవ అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. 
Chandrababu
nomination
Telugudesam
vijayawad

More Telugu News