Jagan: తనపై ఉన్న కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న జగన్

  • శుక్రవారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన జగన్
  • తనపై 11 సీబీఐ కేసులు, ఏడు ఈడీ కేసులు ఉన్నట్టు వివరణ
  • పరువునష్టం దావా, రెచ్చగొట్టిన కేసులు కూడా ఉన్నట్టు పేర్కొన్న జగన్
కడప జిల్లా పులివెందులలో  శుక్రవారం నామినేషన్ వేసిన వైసీపీ అధినేత జగన్ తనపై ఉన్న కేసులు, వాటి దర్యాప్తు వివరాలను వాటిలో వెల్లడించారు. మొత్తం 11 సీబీఐ కేసులు, ఏడు ఈడీ కేసులు, పోలీస్ స్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కేసుల్లో చాలా వాటిని విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అలాగే, తనపై  అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు వివరించారు. పరువు నష్టం దావా, రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తన కింద నమోదైన కేసులు కూడా ఉన్నట్టు వివరించారు. నామినేషన్ పత్రాల్లో జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయనపై మొత్తం 31 కేసులు నమోదయ్యాయి.
Jagan
YSRCP
Pulivendula
Kadapa District
Nomination papers
Andhra Pradesh

More Telugu News