Andhra Pradesh: జగన్ సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తుల వివరాల వెల్లడి!

  • పులివెందులలో నామినేషన్ వేసిన జగన్
  • జగన్ తన ఆస్తుల వివరాలతో అఫిడవిట్ సమర్పణ
  • 18 పేజీల్లో జగన్ పై ఉన్న కేసుల వివరాలు

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలతో పాటు తన ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వివరాలను వెల్లడిస్తూ ఓ అఫిడవిట్ సమర్పించారు. 47 పేజీలున్న ఈ అఫిడవిట్ లో జగన్ పై ఉన్న కేసుల వివరాలు 18 పేజీల్లో ఉన్నాయి.

ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వైఎస్ జగన్ స్థిరాస్తులు రూ.35,30,76,374, భార్య భారతి పేరుపై రూ.31,59,02,925 ఉన్నట్టు తెలిపారు. జగన్ మొత్తం చరాస్తుల విలువ రూ.339,89,43,352 కాగా, భారతి మొత్తం చరాస్తుల విలువ రూ.92,53,49,352 అని పేర్కొన్నారు. జగన్ పెద్ద కుమార్తె హర్షిణీ రెడ్డి చరాస్తుల విలువ రూ.6,45,62,191, చిన్న కుమార్తె వర్షా రెడ్డి చరాస్తుల విలువ రూ.4,59,82,372 గా ప్రకటించారు.

జగన్ పేరిట ఉన్న మొత్తం అప్పులు రూ.1,19,21,202, జగన్ మొత్తం పెట్టుబడుల విలువ రూ.317,45,99,618 గా తెలిపారు. భారతి మొత్తం పెట్టుబడుల విలువ రూ.62,35,01,849, హర్షిణీ రెడ్డి పెట్టుబడుల విలువ రూ.1,18,11,358, వర్షారెడ్డి పెట్టుబడుల విలువ రూ.24,27,058 అని ఆ ఆఫిడవిట్ లో పేర్కొన్నారు.

More Telugu News