Chandrababu: సాక్షి ఇక్కడే ఎక్కడో ఉంటుంది.. సాక్షి టీవీ ఓ పనికిమాలిన టీవీ: చంద్రబాబు ఫైర్

  • అన్నీ అసత్యాలే!
  • వివేకాకు గుండెపోటు అనగానే నేను కూడా సంతాపం తెలిపా
  • జగన్ మీడియాపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ను, ఆయన మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. వివేకా హత్యకేసులో మొదటినుంచి సాక్ష్యాలను తారుమారుచేసి తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ఆరోపించారు. గుండెపోటని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

"సాక్షి.. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. సాక్షి టీవీ... ఓ పనికిమాలిన టీవీ. పాపం వివేకా నిజంగానే గుండెపోటుతో పోయారని నేను కూడా నమ్మాను. అంతేకాదు, సంతాపం కూడా తెలియజేశాను. అక్కడ్నించి అందరికీ అనుమానాలు వచ్చేశాయి. మెదడు బయటికి వచ్చేలా గాయాలు కనిపించిన తర్వాత కూడా దాన్ని గుండెపోటు మరణం అని చెప్పగలిగారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవాలి. ఈ వ్యవహారంలో చివరికి సీఐ కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో టీడీపీ వాళ్లే చంపించారంటూ మాపై ఆరోపణలు చేశారు. ఈ జగన్ మోహన్ రెడ్డి మైండ్ గేమ్ లు ఆడతాడు. కోడికత్తి డ్రామాలు అందరూ చూశారు, ఇంత కోడికత్తికి బారెడంత ఎంక్వైరీనా!" అంటూ విమర్శలు చేశారు. అంతకుముందు ఆయన ప్రసంగిస్తుండగా మైక్ సౌండ్ తగ్గిపోయింది. "బాబూ మైక్ సౌండ్ పెంచండి, లేకపోతే అరిచి అరిచి నా గొంతు పోతుంది, ఆపై మూగ సైగలు చేసుకోవాల్సిందే" అంటూ చమత్కరించారు.

More Telugu News