Nitin Gadkari: అద్వానీకి సీటివ్వని కారణమిదే: నితిన్ గడ్కరీ

  • బీజేపీ తొలి జాబితాలో కనిపించని అద్వానీ పేరు
  • ఆయన వయసు, ఆరోగ్యం రీత్యా సీటివ్వలేదు
  • అద్వానీ ఎన్నటికీ తమ నేతేనన్న నితిన్

బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ పేరు లేకపోవడం, ఆయన పోటీ చేస్తూ వచ్చిన గాంధీనగర్ నుంచి అమిత్ షా పేరును ప్రకటించడంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. ఆయన ప్రస్తుతం 9 పదుల వయసులో ఉన్నారని, వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని పార్టీ తీసుకుందని చెప్పారు.

ముందుగానే విషయాన్ని అద్వానీతో చర్చించామని, ఆయన తమందరికీ ఎంతో ప్రేరణనిచ్చిన వ్యక్తని అన్నారు. ఏ పార్టీలో అయినా, సమయానుకూలంగా కొన్ని మార్పులు తప్పవని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయన పార్టీలో ఎన్నటికీ గౌరవ నేతేనని చెప్పారు. అద్వానీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ పార్టీకి ఉంటుందని, టికెట్ ఇవ్వలేదన్న విమర్శలు వద్దని సూచించారు. ఇవే ఎన్నికల్లో ఆరోగ్య సమస్యల రీత్యా సుష్మా స్వరాజ్ కూడా పోటీ చేయడం లేదని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. నాగపూర్ లో తనకు నాలుగున్నర లక్షలకు పైగా మెజారిటీ వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News