East Godavari District: టీడీపీకి హర్షకుమార్ గుడ్ బై.. టీడీపీ-జనసేన ఒకటేనని విమర్శ!

  • ఇటీవలే టీడీపీలో చేరిన హర్షకుమార్
  • జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ టికెట్లను  టీడీపీ ఫిక్స్ చేస్తోంది
  • టీడీపీతో పొత్తు లేదని పవన్ ప్రమాణం చేయాలి
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇటీవలే టీడీపీలో చేరారు. టీడీపీలో చేరి పట్టుమని పది రోజులు కూడా కాకముందే, ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు ఆయన ప్రకటించారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తనకు సీటు దక్కుతుందని భావించిన హర్షకుమార్ కు చుక్కెదరు అవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో హర్షకుమార్ మాట్లాడుతూ, టీడీపీ, జనసేన పార్టీలు రెండూ ఒక్కటేనని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ టికెట్లను టీడీపీ ఫిక్స్ చేస్తోందని ఆరోపించారు.
East Godavari District
Amalapuram

More Telugu News