Pawan Kalyan: పదో తరగతి పాస్ అయినట్టు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న పవన్ కల్యాణ్!

  • గాజువాకలో పవన్ నామినేషన్
  •  నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ సమర్పణ
  • ఆస్తుల వివరాలు వెల్లడి

జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ గాజువాక అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. గురువారం పార్టీ శ్రేణులు వెంటరాగా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందించారు. ఈ క్రమంలో తన వ్యక్తిగత, ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్ ను కూడా సమర్పించారు. అందులో తాను కేవలం పదో తరగతి మాత్రమే పాస్ అయినట్టు స్పష్టం చేశారు. ఇప్పటివరకు పవన్ విద్యార్హతలపై బయట ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆయనే తన చదువు గురించి ఓ ప్రధాన సందేహం తీర్చేశారు.

 ఇక, ఆస్తుల విషయానికొస్తే, రూ.40.81 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపారు. అదే సమయంలో రూ.33.72 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నట్టు వెల్లడించారు. చరాస్తుల విషయానికొస్తే, తన పేరిట రూ.12 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. తన భార్య, బిడ్డల పేరుమీద రూ.3.2 కోట్లు ఉన్నట్టు వివరించారు. అంతేకాకుండా, వారి పేరిట రూ.40 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ఇక, రూ.56 లక్షల మేర ప్రభుత్వ బకాయిలు ఉన్నాయని కూడా పవన్ కల్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.

More Telugu News