Chandrababu: పవన్ కల్యాణ్ మొన్నటిదాకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు... ఇప్పుడేమైంది?: చంద్రబాబు

  • కేసీఆర్ ను ఎందుకు నిలదీయడంలేదు?
  • ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
  • పవన్ పై నేరుగా వ్యాఖ్యలు చేసిన సీఎం
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో ప్రసంగించారు. ఈసారి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ నిన్నమొన్నటి దాకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ఎంతో నష్టం జరిగిందని పవన్ చెప్పారని, ఆ తర్వాత నిపుణుల కమిటీ వేసి రాష్ట్రానికి రూ.75 వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పారని గుర్తుచేశారు. అయితే, ఉన్నట్టుండి పవన్ కల్యాణ్ రాష్ట్రం గురించి ఏమీ మాట్లాడడంలేదని, కేసీఆర్ ఎన్ని చేస్తున్నా ప్రశ్నించడంలేదని ఆరోపించారు. అయినా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే పవన్ పార్టీ పెట్టారా? లేకపోతే ఆషామాషీ వ్యవహారంగా పార్టీ పెట్టారా? ఈ విషయంలో పవన్ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రం మీద మూకుమ్మడి దాడి జరుగుతోందని, అయితే ఆ దాడిని ఎదుర్కొనే శక్తి తమకు ఉందని స్పష్టం చేశారు.
Chandrababu
Pawan Kalyan
Telugudesam
Jana Sena

More Telugu News