Chandrababu: పెన్షన్ పెంచిన తర్వాత కోడళ్లు తమ అత్తలను బాగా చూసుకుంటున్నారు: చంద్రబాబు

  • కొడుకులు తమ పెద్దవాళ్లను బాగా చూసుకుంటున్నారు
  • వృద్ధుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది
  • నన్ను పెద్దకొడుకుగా భావిస్తున్నారు

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటగా పెన్షన్ల అంశాన్ని ప్రస్తావించారు. తాను వృద్ధాప్య పెన్షన్లను రూ.2000కి పెంచిన తర్వాత కుమారులు తమ పెద్దవాళ్లను బాగా చూసుకుంటున్నారని, కోడళ్లు తమ అత్తమామలను మర్యాదగా పలకరిస్తున్నారని చెప్పారు.

పెన్షన్లు పెంచిన తర్వాత వయోవృద్ధుల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని చెప్పారు. ఎవరిపైనా ఆధారపడక్కర్లేదని, రూ.5 కిలోల బియ్యం ఇస్తున్నామని, పండగ పూట కానుకలు ఇస్తున్నామని తెలిపారు. వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తోందని, రూ.5 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. వృద్ధులంతా తనను పెద్దకొడుకుగా భావించి ఆశీస్సులు అందజేస్తున్నారని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న బీమాను రూ.10 లక్షలకు పెంచుతానని హామీ ఇచ్చారు.

More Telugu News