Kurnool District: తప్పు తెలుసుకున్నా, మళ్లీ సొంతగూటికే వచ్చా: వైసీపీలో చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి

  • వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
  • జగన్ మోహన్ రెడ్డికి నేను అన్యాయం చేశా 
  • అందుకే, తిరిగి వైసీపీలో చేరా
కర్నూలు జిల్లా టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎస్వీ మోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పిన జగన్ సాదరంగా ఆయన్ని ఆహ్వానించారు. అనంతరం, మీడియాతో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డికి తాను అన్యాయం చేశానని, తప్పు తెలుసుకున్నానని, అందుకే, మళ్లీ సొంతగూటికి వచ్చానని అన్నారు. బేషరతుగా వైసీపీలో చేరానని, ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పాటుపడతానని చెప్పారు.
Kurnool District
Telugudesam
sv mohan reddy
YSRCP

More Telugu News