Visakhapatnam: గాజువాక అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన పవన్ కల్యాణ్

  • రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ
  • పవన్ వెంట ‘జనసేన’ నేతలు
  • రోడ్ షో నిర్వహించిన ‘జనసేన’
విశాఖపట్టణం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. స్థానిక జీవీఎంసీ జోన్ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం తమ పార్టీ నేతలతో కలిసి పవన్ వెళ్లారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాగా, నామినేషన్ సమర్పించేందుకు ముందు జనసేన పార్టీ శ్రేణులు మర్రిపాలెం నుంచి గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించాయి.
Visakhapatnam
Janasena
Pawan Kalyan
Gajuwaka

More Telugu News