Yadadri Bhuvanagiri District: కారెక్కేందుకు సిద్ధమవుతున్న టీడీపీ మహిళా నేత శోభారాణి

  • మాజీ ఎంపీ నామాతోపాటు ఆమె వెళ్లనున్నట్లు సమాచారం
  • కేసీఆర్‌ సమక్షంలో చేరేందుకు నిర్ణయం
  • తెలంగాణలో టీడీపీకి మరో మైనస్‌
ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మూహూర్తం ఖరారు చేసుకోగా ఆయనను అనుసరించేందుకు మరో మహిళా నేత సిద్ధమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత బండ్రు శోభారాణి త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె టీఆర్‌ఎస్‌ నేతలతో మాట్లాడుకున్నారని, సీఎం కేసీఆర్‌ సమక్షంలో నామా నాగేశ్వరరావు చేరిన సందర్భంలోనే ఆమె కూడా టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీకి కొంత మైనస్సే.
Yadadri Bhuvanagiri District
Telugudesam
badru sobharani
TRS

More Telugu News