srivishnu: 'బ్రోచేవారెవరురా' నుంచి ఫస్టులుక్

షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. విలక్షమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అందువల్లనే ఆయనకి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా 'బ్రోచేవారెవరురా' రూపొందుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శ్రీవిష్ణు సరసన నాయికలుగా నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ నటిస్తున్నారు.

ఈ రోజున 'హోలీ' పండుగ కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. శ్రీవిష్ణు .. రాహుల్ రామకృష్ణ .. ప్రియదర్శి పాత స్కూటర్ పై ప్రయాణం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. స్నేహాం .. ప్రేమ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. టైటిల్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా,  టీజర్ .. ట్రైలర్లతో మరింతగా ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Go Back to Shorts
srivishnu
niveda

More Telugu News