చీరాలలో నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత కరణం బలరాం!
- తొలుత వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు
- భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి నామినేషన్
- ఎమ్మెల్సీ సునీత, మాజీ మంత్రి రామారావు హాజరు
కరణం జయరాం వెంట ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు, కరణం వెంకటేశ్ తదితరులు ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కరణం బలరాం మీడియాతో మాట్లాడుతూ.. చీరాల నుంచి ఈసారి భారీ మెజారిటీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మరోసారి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.